Hyderabad market has seen a sudden spurt in papaya sales inin papaya sales in the last couple of weeks, courtesy of Dengue. The prevalence of dengue cases in the city in parin particular and across Telangana in general panicked people. Hospitals are filled with dengue and viral fever patfever patients. The state government had already cancelled leaves of doctors and medical staff for the next t two months.
#PapayaFarmer
#Hyderabad
#KothapetMarket
#fruitmarket
#Chandraiah
#Nagarkurnool
#dengue
డెంగ్యూ వ్యాధి బొప్పాయి పండ్లకు గిరాకిని పెంచింది. డెంగ్యూ బారిన పడిన వారు బొప్పాయి తినాలని డాక్టర్లు సూచించడంతో బహిరంగ మార్కెట్‌లో దానికి గిరాకి పెరుగుతోంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య తక్షణమే పెరిగేందుకు బోప్పాయి దోహదం చేస్తుండడంతో దానికోసం జనాలు పరుగులు తీస్తున్నారు. ఇరుగు పొరుగు ఇంట్లో బొప్పాయి పండ్లతో పాటు చెట్టు ఆకులను సైతం తీసుకెళ్లి తింటున్నారు. దీంతో బొప్పాయి మార్కెట్లో దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ధరలు విపరీతంగా పెరిగాయి.గత రెండు నెలలుగా వైరల్ ఫీవర్ హైదరాబాద్ జంటనగరాల్లో విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే..ఏ చిన్న ఆసుపత్రి చూసిన రోగులతో కిటకిటలాడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా డెంగ్యూ విజృంభించడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. డెంగ్యూ వ్యాధి బారిన పడినవారికి ప్లేట్‌లెట్స్ తగ్గడంతో వేల రుపాయలను ఆసుపత్రుల్లో ఖర్చుపెట్టాల్సి వస్తోంది. దీంతో ప్లేట్‌లెట్స్ రికవరి కోసం బొప్పాయి పండ్లతో పాటు,వాటి చెట్టు ఆకుల రసాలను తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీని ద్వార త్వరగా రికవరి అవుతారని చెబుతున్నారు.